Categories
ఈ వేసవిలో మట్టి పాత్రలు గ్లాసులు మట్టి బాటిల్స్ లో ఉండే నీళ్లు తాగండి అంటున్నారు ఎక్సపర్ట్స్. మరీ చల్లగా ఉండే నీళ్లు కాకుండా గది ఉష్ణోగ్రత లో ఉండే నీళ్లు త్రాగటం మంచిది. అలాగే ఎక్కువ నీళ్లు ఎవరు తాగాలి అంటే 60 ఏళ్లు దాటిన వాళ్ళు, గర్భవతులు, రక్తపోటుతో బాధపడే వాళ్ళు, రక్త సరఫరా వ్యవస్థ లో లోపాలు ఉన్న వాళ్లు, కిడ్నీ లో రాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు మరి కాసిన్ని ఎక్కువే నీళ్లు తాగాలి. ఆ నీటిని గబగబా తాగకుండా గుక్కలు గుక్కలు గా పట్టి పట్టి తాగాలి. ఉదయం నిద్ర లేవగానే, వ్యాయామానికి ముందు, తర్వాత నీళ్లు తాగమంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ ఎండలకు నీళ్లను మించిన పానీయం ఇంకోటి లేదంటున్నారు.