Categories
ఇంట్లో ఉన్న కాసేపు ఎక్కడికక్కడ ఫ్యాన్ లు ,ఇంట్లో ఎసీలు ఉంటాయి. కనుక వేసవి తాపం సమస్య లేదు .కానీ బయటకు పోకుండా కుదురుతుందా? ఆఫీస్ పనులు,ఇంట్లో పనులు ఎన్నుంటాయి. మధ్య మధ్యలో మరీ చెమటతో తడిసి ముద్దైయి పోకుండా మీనీ మిస్ట్ ఫ్యాన్ లు మార్కెట్ లో కి వచ్చాయి. ఇది చిన్న నీళ్ళ బాటిల్ లాగా ఉంటుంది. బ్యాటరీతో పనిచేస్తుంది. బయటకి పోయే ముందర ఇందులో ఐస్ వాటర్ పోసుకొని వెళితే మధ్యలో ఎక్కడైన కాసేపు రెస్ట్ గా నిలబడి ఈ మిస్ట్ ఫ్యాన్ బటన్ నొక్కితే చాలు, నీఅటి తుంపరలు పడుతూ చల్లని గాలి వస్తుంది. ఎండలో కూడా హాయిగా ప్రయాణం చేయవచ్చన్న మాట.