ఎండ మండిపోతూ ఉంటే చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది. అప్పుడు మాత్రం సాఫ్ట్ డ్రింక్స్ అస్సలు తాగద్దు అంటున్నారు పరిశోధకులు. దాని ప్రభావం మాత్రపిండాలపైన పడి వాటిని దెబ్బ తీస్తాయి. ఏదైనా శరీరక శ్రమ చేసే ముందు ఆ పని పూర్తైయ్యాక శరీర ఉష్ణోగ్రత , మూత్రపిండాల పని తీరు గుండె కొట్టుకోవటవం గమనించారు పరిశోధకులు .చాలా మంది రక్తంలో క్రియాటిన్ అనేది కనిపించింది. శరీరంలతో క్రియాటిన్ పెరగటం అంటే మూత్రపిండాల పని తీరు సక్రమంగా లేక పోవటం ఇలా ఉన్నా వాళ్ళు దాదాపు సాఫ్ట్ డ్రింక్స్ తాగేవాళ్ళే.వీరి శరీరంలో ఇతర హానికర రసాయనాలు అధికంగా ఉన్నాయట. సాఫ్ట్ డ్రింక్ తాగితే అప్పటికి దాహాశాంతి ఇస్తుంది కానీ అది శరీరంలో నీటిని తాగేసి డీ హైడ్రేషన్ కు గురిచేస్తుందనీ పరిశోధకులు చెపుతున్నారు.

Leave a comment