Categories

ఉదయపు వేళ ఇంట్లో ఎంతో హడావుడి ఉంటుంది పనుల జాబితా వత్తిడి కలిగిస్తూ ఉంటుంది. ఉదయం 9 గంటలకు కొన్ని పనులు పద్ధతిగా చేస్తే వత్తిడి ఉండదంటున్నారు నిపుణులు. సూర్య కిరణాలు భూమిని చేరక ముందే నిద్ర లేవాలి మెడిటేషన్ కనీసం పది నిమిషాలు చేసినా చాలు అది పాజిటివ్ ఎనర్జీ ని పెంచి రోజంతా చురుగ్గా ఉంచుతుంది. ఉదయాన్నే నీళ్లు తాగాలి జీర్ణశక్తి బాగా ఉంటుంది. కనీసం పది నిమిషాలు వాకింగ్ అవసరం. ఏ పనులు చేయాలో ఒక వరుస క్రమంలో నిర్ణయించుకుని నోట్ చేసి పెట్టుకుంటే సమయానికి పూర్తవుతాయి. దీనికిగాను ముందురోజు రాత్రే రేపు ఉదయానికి కావలసిన కూరగాయలు, బ్రేక్ ఫాస్ట్ కు అవసరమైనవి రెడీ చేసి పెట్టుకోవాలి.