ఇంగ్లీష్ పాఠాలు చెపుతోంది యశోదా లోధి ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంబి జిల్లా లో సిరాతు నగర్ అనే పల్లెటూర్లో ఉంటుంది యశోద. హిందీ మీడియం లో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. బంగాళదుంప చేలల్లో కూలి కి వెళ్తుంది. యూట్యూబ్ లో చూసి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంది. అట్లా నేర్చుకుంటూనే తన సొంత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ పాఠాలు నేర్పటం మొదలు పెట్టింది యశోద. మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో యశోద లోధి ఒక సక్సెస్ ఫుల్ పంతులమ్మ.

Leave a comment