చలిగాలులకు చర్మంలో తేమ తగ్గిపోయి పొడిబారి పగుళ్లు వస్తాయి. ఇందుకోసం ఇంట్లోనే సీరమ్ తయారు చేసుకోవచ్చు. కమల పండు తొక్కలు ఒక గిన్నెలో వేసి రెండు టేబుల్ స్పూన్ గులాబీ నీరు అర టేబుల్ స్పూన్ గ్లిజరిన్ విటమిన్ ఇ క్యాప్సిల్స్ నూనె కలపాలి. వీటిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసి వడకడితే వచ్చే రసంలో కాస్త అలోవెరా గుజ్జు కలిపి సీసాలో భద్రపరుచుకుంటే రెండు మూడు వారాలు వాడుకోవచ్చు. క్రీమ్ రాసుకునే ముందు ఈ సిరమ్ నాలుగు చుక్కలు ముఖానికి రాసుకుంటే తాజాగా మృదువుగా ఉంటుంది.

Leave a comment