రోజుకు పదివేల అడుగులు వేయగలిగితే ఆరోజినైకీ ఎంతో లాభం. అంటారు నిపుణలు. నడవటం మంచిదో నడవటం వల్ల లాభమని పరుగువల్ల లాభమా? ఎటువంటి నేలపైన నడవాలి. నడిస్తే చెమట పట్టి తీరాలా ఇలా ఒకటి రెండు కాదు సందేహాలు చాలా మందిని వేధిస్తాయి. కానీ గుండె ఆరోగ్యానికీ సంబంధించి నడకకూ జాగింగ్ కు అంత తేడా లేదు. కొండ ఎక్కి దిగటం మంచి వ్యాయామమూ అంటే శరీరాన్ని వేగంగా కదలికలో ఉంచినప్పుడు ఎక్కడ చేసిన ఒక్కటే . కొండా నుంచి దిగుతున్న క్యాలరీల వినియోగం అధికంగానే ఉంటుంది నడక వల్ల శరీరంలోని కింద భాగమే లాభం పొందుతుందన్నది వాస్తవం కాదు. నడవాలంటే కాళ్లతో పాటు శరీరం చేతులు అన్నీ అవయవాలు చురుకుగానే పనిచేస్తాయి. నడక ఏరోబిక్ వ్యాయామం ఇప్పుడు వేసే అడుగుల సంఖ్యని చుస్తే ఆడవాళ్లు ఇంటి పని కోసం 1000 నుంచి 1200 అడుగులు వేస్తారు. కారు కడిగేందుకు తుడిచేందుకు 1000 నుంచి 1500 అడుగులు వేయవలసి ఉంటుంది. అంటే నడకను విసుగులేని పనిగా అడుగులు లెక్కపెట్టటంగా మార్చినా దానిలో ఖచ్చితమైన సమయం ఉండాలి. చేసే పని వ్యాయామం కోసం అన్నీ సిద్ధ పడాలి. కనీసం అరగంట పాటు రెండు పావుగంటలుగా విభజించుకుని అయినా సరే ఈ పనుల వ్యాయామం మాదిరిగా చేస్తేనే క్యాలరీలు కరుగుతాయి. తీరుబాటుగా చేసే పనులు వాకింగ్ లోకి రావు .
Categories