Categories
కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో 44 సంవత్సరాల ముక్తార్ మాయీ పాల్గొన్నాది. ఆమె సెలెబ్రెటీలకే సెలబ్రెటీ. 14 సంవత్సరాల క్రితం ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది. 2002 సంవత్సరంలో మాయీ సోదరుడు తన ప్రత్యర్థి కుటుంబాన్ని అవమానించాడు. దానికి బదులు గ్రామా గిరిజన పెద్దలు ముక్తార్ మాయీ పై సామూహిక అత్యాచారం జరపాలని ఆమెను బహిరంగంగా నగ్నంగా వీధుల్లో తిప్పాలని కఠిన శిక్ష విధించారు. శిక్ష అనుభవించిన ముక్తార్ తనకు జరిగిన అన్యాయం పై న్యాయ పోరాటం చేసింది. సుప్రీమ్ కోర్టు కు ఎక్కింది. తన అనుభవాలతో ముక్తార్ మహిళల హక్కుల కోసం ఉద్యమించింది. తాను మీర్ వారా గ్రామంలో ఒక ఆడపిల్లల స్కూల్ అనాధ మహిళల కోసం కేంద్రాన్ని స్థాపించింది. ఈ సెలబ్రెటీ రాంప్ వాక్ లో అందరు ఆమెను అభినందించారు.