Categories
పక్షులను ప్రేమించే వాళ్ళు తప్పని సరిగా సిక్కిం చూడాలి. హిమాలయ పర్వత ప్రాంతమైన సిక్కిం లో అద్భుతమైన జీవవైవిధ్యం కనిపిస్తుంది. సిక్కిం చాలా చిన్నదే. కానీ ఒక దిశలో మంచుతో కప్పబడిన హిమాలయాలు,ఇంకోవైపు ఉష్ణ మండల వాతావరణ ప్రదేశం ఉంటాయి. ఈ ఉష్ణ ప్రాంతం నుంచి హిమ ప్రాంతానికి వెళుతోంటే ఆ పీఠ భూమిలో దాదాపు 550 రకాల పక్షి జాతుల్ని చూడచ్చు . వాటి రంగులు కేకలు చాలా ప్రత్యేకం. ఈ హిమాలయ ప్రాంతాల్లోనే ఆ వాతావరణంలోనే నివసించే పక్షుల ముక్కులు,రంగులు ఎన్నో రకాలుగా ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి.