Categories
క్రమం తప్పకుండా యాలకులు ఆహారంలో భాగంగా వాడితే అవి డిప్రెషన్ దూరం చేస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి. ఒక యాలకు పలుకుతో నోట్లో తాజా శ్వాస వస్తుంది. ఇంత చిన్న ప్రయోజనంతో పాటు యాలకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఆస్తమాకు యాలకులు మంచి వైద్యం వేడిపాలతో యాలకు పొడి కలిపి తాగితే అవి ఊపిరితిత్తుల్లోకి ఇన్ ఫ్లమేషన్ ను నివారిస్తాయి. డయాబెటీస్ ని ఆలస్యం చేయటంలో లేదా నివారించటంలో కూడా యాలకులు బాగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక అనారోగ్యలు ,యాసిడ్ రిఫ్లెక్స్ వంటివి ,ఛాతీలో మంట మొదలైన వాటిని అరికడతాయి. వీటిలోని యాంటీ ఆక్సీడెంట్స్ కొలెస్ట్రాల్ పాళ్ళను తగ్గిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ లను దగ్గరకు రానివ్వవు. రక్త పోటును నియంత్రణలో ఉంచుతాయి.