వేసవి తాపం మొదలైతే చల్లబరిచే కిరాలు, వాటర్మెలాన్ లు, కర్భుజాలు గుట్టలుగా వస్తుంటాయి. కిరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ, ఎలాంటి రుచి పచి లేకుండా కాస్తంత దోస వాసన రుచితో వుండే కీరా అంటే చాలా మంది ఇష్టపడరు. ఇందులో వుండే 95 శాతం నీరు వేసవి తాపాన్ని తగ్గించడమె కాకుండా సూర్య రశ్మి కారణంగా వచ్చే చర్మ సమస్యల్ని నివారిస్తుంది. హార్మోన్ సమస్యల వున్న వాళ్ళకి ఇది ఎంతో మంచిది. తప్పని సరిగా ఒక కిరా కొనడం వల్లన వీటిల్లోని స్టెరోయిడ్స్ కారణంగా, కొలెస్త్రోల్ శాతం బాగా తగ్గుతుంది అని తేలింది. కీరాలోని ఎరప్సిన్ అనే ఎంజైమ్స్, ప్రొటిన్ల జీర్ణ క్రియ సమస్యలు తగ్గిస్తుంది. ఇందులోని నిరు,పిచు కారణంగా పేగు లోని టాక్సిన్లు పోతాయి. నోటి దుర్వాసనునకు కూడా కిరా మంచి మందు. కిరాలో వుండే బి-విటమిన్లు ఆర్డినల్ గ్రంధుల పనితీరు తోడ్పడి ఒత్తిడిని తగ్గిస్తాయి. కిరా తినడం అలవాటు చేసుకోవాలి.
Categories