నీహారికా,
కన్నీళ్ళు కళ్ళకు మంచివంటారు డాక్టర్లు, పొడి కళ్ళు తడిగా అవ్వటానికి కళ్ళ డాక్టర్లు రిఫ్రెష్ టియర్స్ వంటి చుక్కల మందును సిఫార్సు చేస్తారు. కళ్ళకు తడి చాలా అవసరం అంటే ఊరికే ఏడుస్తూ వుంటే వెచ్చే తడ, కన్నీళ్ళు రావడం వల్ల ప్రయోజనం ఏమీ వుండదు. మనసు కరిగి, గుండె కరిగి కళ్ళు ఆరాయను ప్రేమను జాలిని వర్ణించాలి. అవే అసలైన కన్నీళ్ళు కొన్ని కస్టాలు వింటూ వుంటే దుఖం ముంచుకు వస్తుంది. అనిర్వచనీయమైన భావంతో ఉద్వేగం లో కన్నీళ్ళు మన ప్రెమేయం లేకుండా ధారలు గా ప్రవహిస్తాయి. కానీ ఈ మధ్య మనుష్యుల్లో ఇలాంటి భావాలు దూరం అవ్వుతున్నాయి అనిపిస్తుంది. ఒక వాట్సప్ ఫోటో వచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగింది. మనిషి ఆకరి క్షణాల్లో చేతులు కాళ్ళు ఆడిస్తున్న దృశ్యం. దాన్ని ఫోటో తీసేందుకు పోస్ట్ చేసేందుకు ఎవరికి మనసోప్పిందో తెలియదు. ఆ చావబోయే మనిషి నోట్లో గుక్కెడు నీళ్ళు పోయకుండా ఫోటో తీసిన దృశ్యం గుర్తుకు వస్తే కళ్ళు చమురుస్తున్నాయి కానీ ఇప్పుడు రాకూడదు కదా కన్నీళ్ళు. ఇలాంటి సందర్భాల్లో ఎలా స్పందించాలో మన్యుషులకు తెలుసు కానీ మరచిపోతున్నారు. హృదయం కరిగి నీరవ్వాల్సిన చోట మనిషి బండ బారితే ఎంత నష్టం?