Categories
మన ఆహార విధానం పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేదిగా ఉండాలి అంటారు ఎక్స్ ఫర్ట్స్. ఏ ఆహారం తీసుకొన్న అది సరైన పరిమాణంలో ఉంటే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. చపాతీలు, గోధుమ ,జొన్న రెట్టెలు ముడి బియ్యం ఇలా ఏ ధాన్యపు ఉత్పత్తులైనా సరే వాటిలో మాంసకృత్తులు ,పీచు ఎక్కువే. కాస్త తిన్న కడుపు నిండి పోతుంది. ఈ ఆహారంతో పాటు ఆకుకూరలు ,కాయగూరలు, వెన్న తీసినపాలు ,పెరుగు ఉంటే శరీరం బరువు లేకుండా తేలిగ్గా ఉంటుంది.ప్రతి ధాన్యంలో దానికే ప్రత్యేకమైన పోషకాలు ఉంటాయి. కనుక ఒకే ధాన్యపు వంటకం ప్రతి రోజు తినకుండా అన్ని రకాల ధాన్యాలు మార్చి మార్చి తింటూ రావాలి.సరైనా పరిమాణంలో భోజనం ఉండాలన్న ది మరచి పోకూదు.