లివ్ అండ్ లెట్ మిలివ్ అంటోంది అక్షరహాసన్ కమల్ హాసన్ చిన్న కుమార్తె.ఓ ఫోటో షూట్‌కి సంబంధించిన ఆమె ఫోటోలు ఎవరో అజ్ఞాత వ్యక్తి హ్యక్ చేసి హెడ్డింగ్స్ పెట్టి మరీ ఇంటర్ నెట్ లో ఉంచారు. నెట్ లో తిరుగుతున్న ఆ ఫోటోల గురించి స్పందిస్తూ కామాంధుడైన ఒక సైకో అలోచనలు ఒక అమ్మాయి పర్సనల్ విషయాలను లీక్ చేయమని ప్రేరేపిస్తే ఆ ఫోటోలకు పేర్లు పెడితే అదంతా నన్ను నిస్సహయకురాలిని చేసింది. ఫోటోలు షేర్ చేసిన వ్యక్తులు నన్ను వేధించటంలో పాల్గొన్నారనిపించింది. మీటూ ఉద్యమం ద్వారా దేశం మొత్తం స్త్రీల భద్రత గురించి జాగ్రత్తపడుతు ఉంటే కొంత మంది భయం లేకుండా నావంటి అమ్మాయిలను వేధింస్తున్నారు. ఈ విషయం ముంభై పోలీసులకు తెలియజేశాను. త్వరలో అతన్ని ఎలాగుపట్టుకొంటారు. హుందగా బతకండి మమ్మల్ని బతకనివ్వండి అంటూ అక్షర ఆగ్రహం వ్యక్తం చేసింది.