
ఇంటర్నెట్ వాడుతూ స్మార్ట్ ఫోన్ ద్వారా సమాచారం అందుకోవటం దాన్ని వెంటనే స్పందించి పోస్ట్ చేయడం వల్ల అటూ సోషల్ మీడియా లోకి అడుగుపెట్టి ఇంకో కంటితో ఆఫీస్ పని పైన దృష్టి పెట్టడం వల్ల పని చేసే సామర్ధ్యం తగ్గిపోతుందని అద్యయనాలు చెపుతున్నాయి. దీని వల్ల పెరిగే వత్తిడిలో లక్ష్యాలు అందుకోలేకపోతున్నారని రిపోర్ట్ గట్టిగా చెబుతుంది.శరీరంలో సరఫరా అయ్యే శక్తితో నలభై శాతం మెదడు ఉపయోగించుకుంటుంది. ఇప్పుడీ అంశాల పై ఎక్కువ దృష్టి పెట్టవలసి రావడం అంటె మెసేజ్ లు చూడటం వెంటనే రిప్లై ఇవ్వడం దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం నిమిష నిమిషానికి దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూసుకోవడం వంటి పనులతో మెదడు అలసిపోతుంది. అన్ని సౌకర్యాలు ఉన్న ఇళ్ళలో,ఆఫీసుల్లో యువత అలసిపోతున్నారు అంటే మల్టీ టాస్కింగ్ వల్లనే