Categories
ఈ సారి వ్యాయామం మొదలు పెట్టబోయే ముందర బీట్ రూట్ రసం తాగండి దాని వల్ల 16శాతం ఎక్కువ సమయం వ్యాయమాం చేయగలుతారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బీట్ రూట్ పోషకాల నిలయం.బీట్ రూట్ లో ఉండే నైట్రేట్స్ శరీరం సైట్రిక్ ఆక్సైడ్ గా మారి తేలికైన వ్యాయమాలు చేసేటప్పుడు ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుంది. బరువైన వ్యాయమాలు చేసే శక్తిని ఇస్తుంది. ఇందుకు కారణం ఇందులో ఉన్న ఇన్ ఆర్గానిక్ నైట్రేట్ కారణం. ఈ రసం తాగటం వల్ల సిస్టాలిక్ రక్త పోటు నాలుగు నుంచి ఐదు పాయింట్లు తగ్గినట్లు ఒక అధ్యయనం నిర్ధారించింది. వీటిలో ఉండే పోటాషియం వల్ల నరాలు కండరాలు ఆరోగ్యంగా పని చేస్తాయి.