Categories
పూర్వ కాలంలో గర్భిణిగా ఉన్న అమ్మాయికి నెయ్యి వేసిన ఆహరం తినిపించేవాళ్ళు .నెయ్యి ద్వారా వచ్చిన కొవ్వు ప్రభావం పొట్ట తుంటి పైన ఉంది ప్రసవం సులభం చేస్తాయని నమ్మేవాళ్ళు. అలాగే ఈ పుష్టికరమైన ఆహారం ద్వారా కేలరీలు పెరిగిన ప్రసవం తర్వాత పిల్లలను సాకే క్రమంలో చేసే శ్రమకు ఆ అదనపు బరువు తగ్గిపోతుంది అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్తితిలో గర్భిణులకు ఎక్కువ నెయ్యి అవసరంలేదంటున్నారు. కడుపులో పిండం పెరిగే సమయంలో శరీరం తీవ్రమైన ఒత్తిడి తో ఉంటుంది. గుండె ఎక్కువగా పనిచేస్తుంది. రక్తపోటు పెరిగి ఉంటుంది. ఆసమయంలో నెయ్యి ద్వారా వచ్చే కొవ్వు వల్ల అదనపు బరువుతో హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక గర్భిణులకు రోజుకు 50 గ్రాముల కొవ్వు చాలు.