ప్రత్యేకంగా ఉంటే పది మంది మెచ్చితే అవి బ్రాండ్ అయిపోతాయి. గొల్ల్బామ చీరెల్లాగ చీరాల,గుంటూరు,ఉప్పాడ,పోచంపల్లి ఇవన్ని బ్రాండ్స్. అలాగే తెలంగాణలోని సిద్దిపేటలో తయారయ్యే గొల్లభామ చీరెలు కూడా ఇప్పుడు బ్రాండే. ఎప్పుడో 70 ఏళ్ళ నాడు చేనేత కార్మికులు వీరబత్తిని సోమయ్య,రచ్చ నర్సయ్యలు తల పైన పాలకూర, చేతిలో పెరుగు పట్టుకుని వీధిలో నడిచిపోతున్న ఓ మహిళ నీడను చూసి ఆ డిజైన్ లో ఇప్పుడు పట్టు,చేనేత,గొల్ల భామ చీరెళు దేశ విదేశాల్లో సందడి చేస్తున్నాయి.