అందమైన జుట్టు కావాలంటే మంచి షాంపూలు, ఆయిల్స్ తో నే సరిపోదు. చెక్కని జుట్టు కోసం ఆహారంలో కూడా కొన్నింటిని చేర్చాలి. కోడిగుడ్డులో ప్రోటీన్ల తో పాటుగా బయోటెక్ అనే పదార్ధం కూడా వుంటుంది. జుట్టు బలంగా పెరగాలి అంటే ఇది చాలా అవసరం. జుట్టు మెరిసేలా చేసేందుకు చిగుల్లు చిట్లి పోకుండా ఒమేగా-3 ఫ్యాట్స్, జింక్, విటమిన్-ఇ మొదలైనవి కావాలి. అవన్నీ బాదాం పప్పులో దొరుకుతాయి. ఉసిరిలో విటమిన్-సి వుంటుంది. ఇది జుట్టుకు మెత్తదనం ఇస్తుంది. చిలకడ దుంపలో బీటా కెరోటిన్, విటమిన్-ఎలు వుంటాయి. ఇవి జుట్టు మోదళ్ళను బలంగా ఉంచుతాయి. పచ్చి బటానీ లో విటమిన్-సి వుంటుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. వాల్నట్స్ లో వుండే విటమిన్-ఇ, బయోటెన్ లు జుట్టును ఆరోగ్య వంతంగా ఉంచుతాయి. ప్రతి రోజు నాలుగు వాల్ నట్స్ తింటే చాలా మంచిది. గుమ్మడి గింజల్లో కాపర్, జింక్, విటమిన్-ఇ, విటమిన్-బి. మెగ్నీషియం వంటివి వున్నాయి. వీటిని రొజూ తింటే జుట్టు ధృడంగా వుంటుంది.
Categories