ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్ చేయక పొతే చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. బొప్పాయిలో వుండే ఎంజైమ్స్ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. రెండు చెంచాల గుజ్జు లో కొద్దిగా ఆలివ్ నూనె, చెక్కర కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోని కడిగేస్తే ముఖం పై పేరుకున్న మురికి పోతాయి చెక్కని మెరుపు వస్తుంది. కొబ్బరి నూనెలో కొంచ చెక్కర , అర చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి, మెడకి మర్దనా చేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. పావు కప్పు ఓట్స్ పొడిలో పెరుగు, పసుపు, గులాబీ నీళ్ళు కలిపి ఈ మిశ్రమంతో మొహం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. రెండు చెంచాల కాఫీ పొడి లో బాదాం నూనె, కొబ్బరి నూనె కలిపి పూతలా వెయ్యాలి. తడి చేతుల్లో మర్దనా చేస్తే చల్లని నీళ్ళతో మొహం కడిగేసుకోవాలి. కాఫీ పొడి నిర్జీవంగా మారిన చర్మానికి జీవం ఇస్తే బాదాం నూనె తెమ అందిస్తుంది. బియ్యం పిండి, తేనె కలిపిన మిశ్రమంతో మాస్క్ వేసుకుని కడిగేసాక, మాయిశ్చురైజర్ రాస్తే చర్మం చాలా మృదువుగా కనిపిస్తుంది.

Leave a comment