Categories
గుజరాత్ లోని కచ్ తీర గ్రామాల్లో మట్టి గుడిసెలు అద్దాలతో మిలమిల మెరిసిపోతూ కనిపిస్తాయి. భారత్ పాకిస్థాన్ సరిహద్దులోని కచ్ ఎడారిలో నివసించే రబాలి తెగ మహిళలు ఎంతో ఓర్సుతో ఇళ్ళను మట్టి ,ఒంటె లేదా గాడిదల పేడతో అలికి వాటిపైన దుస్తులపైన ఎంబ్రాయిడరీ డిజైన్లు వేసినట్లు అద్దాలను అతికిస్తారు. గుండ్రని ఈ మట్టి గుడిసెల్లో గోడల్లో ,అల్మారాలు చిన్న పెద్ద అద్దాలతో రేఖా గణితాన్ని పొలిన డిజైన్లతో మెరిసిపోతూ ఉంటాయి. ఈ కళ ఎప్పుడు ఎలా పుట్టిందో తెలియదు కానీ కచ్ తీరంలోని అనేక తెగల ఇళ్ళు ఈ శైలితో మెరుస్తాయి. అవన్నీ సోషల్ మీడియా పుణ్యమా అని దేశ విదేశాలు పాకి గుజరాతీ మిర్రర్ అండ్ మడ్ ఆర్ట్స్ ఆధునికమైన ఇళ్ళను మరింత ఆధునికంగా మార్చేస్తున్నారు.