Categories
మనకు తెలిసిన ఆకు కూరలు పొలాల్లో పండించి అమ్మేవి పాల కూర ,చుక్క కూర,గోంగూర ,మెంతి కూర,తోట కూర కానీ పండించకుండా పొలాల్లో వాటంతట అవే పడి మొలిచే ఎన్నో రకాల మొక్కలున్నాయి. గ్రామీణ ప్రాంత రైతులకు ఇవి తెలుసు పాయిల కూర,గునుగు కూర,చిత్రమూలం,సన్నాయిల కూర ,ఫల పత్రం,అత్తిలి ఇలా యాభై కి పైగానే ఆకు కూరలు ఉన్నాయి.జొన్న,సజ్జ వంటి పిండిలో ఇవి కలిపి చక్కని రుచికరమైన ఆరోగ్యకరమైన రోట్టెలు చేస్తారు. అత్తిలి కూర పాలిచ్చే తల్లులకు మంచి ఆహారం.తంగేడి పువ్వు, పిట్టకూర,చెన్నంగి మొదలైన ఆకు కూరల్లో విటమిన్ సీ కాల్షియం,ఫాస్పరస్,,ఐరన్ ,బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఎంతో అధికం.మార్కెట్లో ఏదైన కొత్త రకం ఆకు కూర దొరికితే అలవాటు చేసుకోండి అనుకుంటారు న్యూట్రిషనిస్టులు.