Categories
WoW

ఇవి కాయితాలంటే నమ్మలేం.

ఒక కళాకారుడి చేతికి ఏ వస్తువు ఇచ్చినా అదో పెద్ద కళాఖండమైపోతుంది. చివరకు తెల్ల కాగితం ఇచ్చినా సరే. యానిమల్ పేపర్ స్క్రప్చర్స్ చూస్తూ వుంటే ఎగిరే గ్రద్ద, చక్కని పాండా. ఇవేనా అరచేతి పైనే కాగితం కాస్తా పూవులు, ఆకులు, సీతాకోకచిలుకలూ అయిపోతుంది. కాస్త మడిచి, గోటితో అణిచి మహా సౌధాలే కడతారు.ఇక లేజర్ కట్ పేపర్ ఆర్ట్ అయితే అచ్చంగా ఏ పాలరాతి శిల్పాల లాగా కనిపిస్తాయి తప్ప అవి కాగితంతో తయారయినవి అనిపించవు. ఇక రంగుల పేపర్ అయితే చేతితో మడిచి ఒక రంగుల ప్రపంచాన్నే సృష్టించారు కళాకారులు. వట్టి తెల్ల కాగితాన్ని కత్తిరించి ఎలాంటి చిత్రాలు సృష్టించారో ఓ సారి ఇమేజెస్ చూస్తే చాలు. సమయం, శ్రద్దా ఏదైనా కొత్తదనం సృష్టించాలనే తపన వుంటే చాలు ఈ ప్రపంచమే పెద్ద కాన్వాస్.

Leave a comment