దుపియన్ చీరల్ని వారణాసి చుట్టు పక్కల గ్రామాల వాళ్ళు నేస్తారు. ఈ ఫ్యాబ్రిక్ అక్కడ తరతరాలుగా ఉత్పత్తి అవుతుంది. ఇది పెళ్ళిళ్ళకు ప్రత్యేకం. దుపియన్ చీర సిల్క్ ఫ్యాబ్రిక్. చీర కాస్త బరువుగా నేత చక్కగా వుంటుంది అల్లిక, పువ్వుల డిజైన్లు పూర్తిగా చారల డిజైన్లతో నేస్తారు. అయితే వాటి పైన ఎంబ్రాయిడరీ కుడా చాలా చక్కగా వుంటుంది. కాంజీవరం, టస్సర్ సిల్క్ తో పాటు ఈ దుపియన్ చీరలు కుడా సంప్రదాయ సిల్క్ చీరలే. వివాహ శుభకార్యాల కోసం ఎక్కువ మంది ముగ్గేది దుపియన్ సిల్కలకే. సాదా దుపియన్ చీరాల పై హెవీ ఎంబ్రాయిడరీ అదనపు ఆకర్షణ.

Leave a comment