డాక్టర్లు సాధారణంగా నాలుక గోర్లు చూసి అనారోగ్య లక్షణాలను గురించి చెప్పుతారు. గోళ్ళు బిగుతుగా మారి విరిగిపోవడం నాలుక తెల్లగా పాలిపోయి వుండటం పెదవుల చిగుల్లు పగలడం ఇవి కొన్ని పోషకాల లోపానికి సంకేతాలవ్వుతాయి. కాలిపిక్కలు పట్టేస్తుంటే అరికాళ్ళు నొప్పులు మంటా వుంటే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం లోపించిన కారణం వల్ల అనుకోవచ్చు, ముందు వైద్యులకు చూపించుకుని ఈ పోషకాలంటే ఆహారం తీసుకోవాలి. తరచూ పెదవుల చిగుర్లు పగిలి ఇబ్బందిగా వుంటే జంక్, ఇనుము బి12విటమిన్ల లోపం కావొచ్చు. నాలుక పెదవులు పొడిబారి తెల్లగా కనిపిస్తే బి విటమిన్ లోపం అనుకోవచ్చు. గోళ్ళు పగిలి కనిపిస్తే బి విటమిన్ లోపం అనుకోవచ్చు. గోళ్ళు పగిలి కనిపిస్తే జంక్ తగ్గిందని అర్ధం. ఇలా వుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఆ ప్రభావం గోళ్ళ పై కనిపిస్తుంది. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా అవసరం. ఇవి ఆహారం ద్వారా నయం చేయగలిగే అనారొగ్యాలే.
Categories