Categories
ప్రతి రోజు 800 మైక్రో గ్రాముల ఫోలిక్ ఆమ్లాన్ని వరసగా మూడేళ్ళ పాటు తీసుకుంటే వయస్సు తో పాటు వచ్చే మతి మరుపు రాకుండా ఉంటుందిట. మరి ఆఫోలిక్ ఆమ్లం ఎలా దొరుకుతుందీ అంటే లేత తోటకూర, లేత పాల కూరలను తాజాగా తింటే సరిపోతుందిట. అంటే బాగా ఉడికించిన నూడిల్స్ లేదా అన్నం ఈ తోట కూర, పాల కూర పైన వేస్తే ఆ వేడికి అవి మెత్తబడి తినేందుకు వీలుగా ఉంటాయి. అప్పుడు ఆ అన్నం, నూడిల్స్ ని అలాగే ఆకు కూరలతో కలసి తింటే ఫోలిక్ యాసిడ్ శరీరానికి దొరుకుతుంది. శరీరానికి ఫోలిక్ యాసిడ్ శరీరానికి దొరుకుతుంది. శరీరానికి పోలేట్ అవసరం ఎంతో వుంది. అది జ్ఞాపక శక్తి ని పెంచుతుంది. పాల కూర తోట కూర తినగలిగితే మంచిదే మరి.