Categories
ఏ వయస్సు వాటికైనా , ఎవ్వరికైనా కృత్రిమ చక్కర పానీయాల తో నష్టమే. ఈ పానీయాలు గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే గర్భస్థ శిశువు ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని పిల్లల్లో అధిక బరువుకు కారణం అవ్వుతుందని చెప్పుతున్నారు. చాలా మందికి ఎంత తీవ్రతకు దాహం అనిపించినా కూల్ డ్రింక్స్ తాగడమే అలవాటు. ఈ పానీయాలు తాగే అలవాటు ఉన్న వారిపై అధ్యయనాలు జరిగాయి. ప్రతి రోజు కూల్ డ్రింక్స్ తాగే వారి పిల్లలు పుట్టుకతో అధికబరువు తో పుట్టడం కాకుండా ఆ అధిక బరువు పిల్లలు పెరుగుతున్న కొద్దీ కొనసాగడం గుర్తించారు. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్లనే ఈ సమస్య ఉంటుందని అధ్యన కారులు భావించారు.