Categories
పింక్ కలర్ తో చేసిన డ్రింక్ లను ఈ రోజుల్లో సూపర్ డ్రింక్స్ అంటున్నారు. పుచ్చ, బొప్పాయి, డ్రాగన్, నిమ్మ, ద్రాక్ష, గ్రేప్ ఫ్రూట్ బెర్రీలు, జామ తో చేసే గులాబీ రంగు జ్యూస్ లు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అమెరికా లోని వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు ముఖ్యంగా ఆటలు ఆడే వాళ్ళు ఈ గులాబీ రంగులో ఇచ్చిన కాఫీ, పాలు జ్యూస్ ఏదైనా సరే తాగితే అలసట పోయి ఉత్సాహంగా ఉన్నారని పరిశోధకుల మాట. డ్రాగన్ పండు తో చేసే ఎనర్జీ డ్రింక్ కూడా ఈ రంగు లోనే వస్తుంది.ఎర్రని పండ్లతో జ్యూస్ చేయాలని అనుకుంటే అందులో పాలు కలిపితే లేత గులాబీ వర్ణం వచ్చేస్తుంది. నీలిరంగు శంకు పూల డ్రింక్ లో నిమ్మరసం పిండితే గులాబిరంగు వచ్చేస్తుంది. ఇప్పుడి పింక్ డ్రింక్ అందరికీ నచ్చేసింది.