కళ్ళు అలసిపోయినట్లు ఉంటే ముందుగా హాయిగా కాసేపు విశ్రాంతిగా నిద్రపోమంటారు వైద్యులు. మరికొన్ని చిట్కాలు కూడా వారు సూచిస్తున్నారు. చల్లనినీళ్ళలో ముంచిన దూదిని మానసిక కళ్ళపై కాసేపు ఉంచుకోమంటున్నారు. అపుడు అక్కడ రక్తప్రసరణ బాగా సాగి కళ్ళు ఫ్రెష్ గా మారిపోతాయి . కళ్ళ చుట్టు కనురెప్పలపై కీరదోస రసంలో ముంచిన చల్లని దూదిని ఉంచినా కళ్ళు తేటగా కనిపిస్తాయి. కళ్ళు చుట్టు వలయలు పోతాయి . అలాగే టమాటో గుజ్జు పసుపు,నిమ్మరసం సెనగపిండి కలిపిన మిశ్రమాన్ని చల్లగా అయ్యేలా కాసేపు ఫ్రిజ్ లో ఉంచి ఆ మిశ్రమాన్ని కళ్ళ చుట్టు రాసి ఓ అరగంట ఆలా వదిలేయాలి. తడిపిన దూదితో ఆపుతాను తొలగించి మొహం కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే కళ్ళ చుట్టు రక్త ప్రసరణ జరిగి చర్మం చక్కగా తాజాగా వుంటుంది అలసట వల్ల ఏర్పడిన వలయాలు పోతాయి.
Categories