ఫేస్ బుక్ అలా పెరిగిపోతుంది. ఇండియాలో ఫేస్ బుక్ ఉపయోగించే వారి సంఖ్య 94 మిలియన్లకు చేరింది. ప్రతి నిమిషం ఈ సంఖ్య పెరుగుతుంది. ఇండియాలోని ఫేస్ బుక్ మేనేజింగ్ డైరెక్టర్ క్రితిగా రెడ్డి. భారీ ఎత్తున ఉన్న ఈ సోషల్ మీడియా పిథం పైన కూర్చున్న క్రితిగా రెడ్డి కంపెనీ అభివృద్ధిలో ముఖ్య భాగంగా వుంది. ఫోర్బ్ స్ పత్రికలో ఆమె మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్ లిస్టులో 50 స్థానంలో చూపెట్టింది. పెద్ద కంపనీలైన టాటా డోకొమో,యూనిలివర్, లోరియల్ వంటివి ఫేస్ బుక్ ద్వారానే వినియోగ దారునికి చేరుతున్నాయి. వారి అనుబంధ సంస్థల అమ్మకాలు మార్కెటింగ్ టీమ్లను రెట్టింపుగా కొంటున్నాయి. ముంబాయి గుర్ గాన్ లో ఆఫీసులు అద్భుతంగా పని చేస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాలలో వ్యాపారం పెరిగేందుకు, కొత్త స్టార్ట్ అప్స్ ఫేస్ బుక్ ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ ప్రోత్సాహం మొత్తం క్రిత్తిగా రెడ్డి సమర్ధత కారణంగానే అని చెప్పడంలో సందేహం లేదు.
Categories