నేను నటిని అవుదామనే నాప్రయాణం మొదలు పెట్టాను. ఎన్నిఫెయిల్యూర్స్ వచ్చిన అస్సలు కుంగిపోలేదు. జీవితంలో అన్ని సక్సస్ లుంటే మనం స్ట్రాంగ్ కాలేము. ఫెయిల్యూర్స్ తోనే మానసిక దృఢత్వం వస్తుంది. నా విషయంలో అదే జరిగింది నా సినిమా ఎందుకు ఫెయిల్ అయిందో నేను ఒక ప్రేక్షకురాలిగా మారి ఆలోచిస్తాను. ఎక్కడ తప్పు చేశానో,ఎక్కడ తడబడ్డానో గుర్తించుకొని ఆ తరువాత సినిమాలో జాగ్రత్త పడతాను అంటోంది భూమి పడ్నేకర్ . సాదాసీదా కథలు నాకు నచ్చవు. సాంద్ కీ అంభ్ వొప్పుకొనే ముందర చాలా మంది నన్ను హెచ్చరించారు. అప్పుడే అంత వయసున్న పాత్ర చేయటం అవసరమా అన్నారు. కథ నచ్చింది నాకు ఆ సినిమా చేశాను . నాపాత్ర అందరికి నచ్చింది ఒక సినిమా వొప్పుకున్నాక ఎంత కష్టపడేందుకైనా శరీరాన్ని ఎంత కష్టపెటెందుకు అయినా నేను సిద్దమే అంటోంది భూమిక పెడ్నేకర్ .

Leave a comment