ఇంట్లో మేకప్ చేసుకోవాలంటే సరిగా వస్తుందో లేదో అని సందేహంగా వుంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే ఇంట్లో వేసుకోవటం సులభమే. మేకప్ పౌడర్ ని దవడ కింద భాగంలో రాసుకొని సహజమైన వెలుతురులో నిలబడితే అప్పుడు చర్మానికి సరిగా నప్పుతుందో లేదో తెలుస్తుంది. అది ఛాయలో కలిసిపోతే పర్ ఫెక్ట్ గా సరిపోయినట్లు. పౌడర్ పల్చగా వేసుకొన్న,మందంగా వేసుకొన్న కళ్ళ కింద తేడా తెలుస్తుంది. కళ్ళ అడుగున కన్సీలర్ రాసుకోవాలి. అప్పుడే సన్నగా ఉండే గీతాలు కూడా మాయం చేయచ్చు. మందు ఎస్ పి ఎఫ్ ఉన్న మొయిశ్చ రైజెర్ రాసుకొంటే చర్మానికి హాని జరగదు. ఫౌండేషన్ ముఖంపైన చిన్న చుక్కలుగా పెట్టుకొని నెమ్మదిగా కలుపుతు రాస్తూ రావాలి . చర్మంలో పూర్తిగా కలిసిపోయే దాకా రాస్తే ఎక్కువ సేపు నిలచి ఉంటోంది.

Leave a comment