రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన పబురాం మంద్,మున్నీ దేవి దంపతులు ఈ లాక్ డౌన్ సమయంలో 40 గ్రామాల్లో మూడు వేలకు పైగా కుటుంబాలకు తమ పంట దిగుబడులు పంచారు. వారికున్న ఐదు ఎకరాల భూమిలో వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు.ఈ లాక్ డౌన్ లో ఆ పంట దిగుబడి అమ్మకుండా ఆ ధాన్యం తో  పాటు మరికొన్ని నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ఉపాధి లేని పేదలకు పంచారు .జోధ్ పూర్ జిల్లా జాసియన్  తివ్వరీ తహసీల్ పరిధిలోని 80 గ్రామాల్లో ఒక్క కుటుంబానికి 10 కిలోల గోధుమపిండి ,కిలో పప్పు,ఉప్పు,కారం లీటర్ నూనె బిస్కెట్ ప్యాకెట్ లు ,సబ్బులు, పేస్ట్ లు పంపిణీ చేస్తున్నారు,వీరికి ఇద్దరు అబ్బాయిలు పెద్ద కొడుకు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేస్తూ ఉండగా చిన్న కొడుకు ఢిల్లీలో ఆదాయ పన్నుశాఖ డిప్యూటీ కమిషనర్ గా ఉద్యోగం చేస్తున్నారు.

Leave a comment