Categories
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవటం తో పాటు ప్రతి రోజు మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువులు కూడా శుభ్రం చేయాలి .వేళ్ళకు ధరించే ఉంగరాలు బాక్టీరియా సంతానోత్పత్తి ప్రదేశాలు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . 2009 ఓస్లో విశ్వవిద్యాలయం పరిశోధకులు ఉంగరాలు ధరించడం వల్ల బాక్టీరియా సంఖ్యా పెరుగుతుందని కనుగొన్నారు .ఉంగరాలు ధరించిన వారి చేతుల్లో బాక్టీరియా ఉండే అవకాశం రెండు రెట్లు ఎక్కువే .చేతి ఉంగరాలు, వేడినీళ్ళు యాంటీ బాక్టీరియల్ సబ్బు డిష్ వాష్ ఆభరణాల క్లినర్ మిశ్రమం తో శుభ్ర పరిస్తే బాక్టీరియాను తగ్గించ వచ్చు .అలాగే ప్రతి నిత్యం వాడే కంప్యూటర్ కీ బోర్డు పైన కూడా బాక్టీరియా ఉంటుంది .ఇది తీవ్రమైన అంటువ్యాధులకు మూలం అవుతుంది కాబట్టి కంప్యూటర్ డస్టర్ తో కీ బోర్డు క్లీన్ చేయాలి .