Categories
ఇంట్లోంచి కాలు బయట పెడుతూ వుంటే భద్రత కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ఏ క్షణం ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు. ఆఫీస్ నుంచి కాసేపు ఇంటికి రావడం ఆలస్యం అయితే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. అలాగే ఏ ఆటో ఎక్కినా భద్రత విషయం భయమే. అనుకోని అవాంతరమో, ఆగంతుకుల దాడో ఎదురైతే ఏమిటి పరిస్థితి? అలాంటి సమయంలో భయపడకుండా ఫోనులో FIR అనే యాప్ వుంటే మంచిది. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు ఇస్తే చాలు. ఏదైనా ఆపద వస్తే హెల్ప్ అన్న బటన్ నొక్కితే చాలు దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ కు సమాచారం అందుతుంది. ఎక్కడున్నా వివరాలు అందిపోతాయి. వెంటనే సహాయం అందుతుంది. ఎందుకయినా మంచిది ప్రతివాళ్ళు ఈ FIR యాప్ డౌన్లోడ్ చేసుకోండి.