తమన్నా చెప్పుతున్న చినప్పటి కబుర్లు వినేందుకు బావుండటం కాదు ఆడపిల్లలు తక్షణం వాటిని ఆలోచించాలి అన్నట్లున్నాయి. అంట అందం మెయిన్ టెయిన్ చేయడం వెనుక ఎలాంటి కృషి వుందో చూడండి. నేను ఎదిగే కొద్దీ సన్నగానే వున్నాను. ఫిట్ గా అయితే లేను. స్కూల్లో ఓపిక లేక ఆటలు ఆడలేక పోయేదాన్ని. నాకు తిండి పెట్టడం మా అమ్మకు ఓ యజ్ఞం రోజుకో రెండు సార్లు తినేదాన్ని. 14 ఏళ్ళ తర్వాత పని మొదలుపెట్టాక సమతులాహారం ప్రాముఖ్యాన్ని , వర్క్ అవుట్స్ గురించి తెలుసుకున్నా. నా వృత్తి ఫిట్ నెస్ ను డిమాండ్ చేస్తుంది. యు.విన్ లో ఫిట్నెస్ గురించి పూర్తిగా తెలుకున్నా. ఆ తర్వాత నా స్టామినా, ఎనర్జీ స్దాయిలు పెరిగాయి. నా వర్క్ ఔట్స్ లో యోగా ను కలిపెస్తాను. సరైన ఆహారం శ్రద్ధగా తింటాను అంటోంది తమన్నా. ఇవన్నీ వయస్సులో వున్నా అమ్మాయిలు అర్ధం చేసుకుని ఊరికే కడుపు మాడ్చుకుని సన్నగా వుండటం కాకుండా ఫిట్నెస్ తో వుంది చక్కగా చదువుకుని మిగతా వ్యాపకాలుచూసుకోవాలి.

Leave a comment