Categories
పువ్వులతో చేసిన ఫేస్ ప్యాక్ లు వారానికి ఒకసారి వేసుకుంటే ముఖ చర్మం మెరుపులు మెరుస్తుంది. గుప్పెడు మల్లె పూలు స్పూన్ పెరుగు టీ స్పూన్ చక్కెర కలిపి మెత్తగా చేసి ఈ మిశ్రమం ముఖం మెడ పై అప్లై చేయాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. గుప్పెడు గులాబీ రేకులు నీళ్లలో ఉడికనిచ్చి మెత్తగా చేసి దానికి ఓ స్పూన్ గంధం పొడి, పాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. గుప్పెడు మందార పువ్వులు 10 గులాబీ రేకులు, స్పూన్ ముల్తానీ మట్టి పెరుగు కలిపి మెత్తగా రుబ్బి ముఖానికి అప్లై చేయాలి. ఆరిపోయాక వేళ్ళతో రుద్దుతూ నీళ్లతో తడుపుతూ మర్దన చేసుకోవాలి తర్వాత కడిగేసుకోవాలి.