ఎంత శ్రద్దగా వున్నా వంటిళ్ళు ఎంత శుభ్రం చేసినా ఎదో సమయంలో ఫుడ్ పాయిజనింగ్ చెవిన పడుతూనే ఉంటుంది. ఆహారం విషయం లో జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. ఫ్రిడ్జ్ లో సాధారణం గా ఎండినవి పచ్చివి అన్ని కలిపి పెడతారు. మాంసాహారం విషయం లో ఇది మంచి పద్దతి కాదు. అన్ని పదార్థాలున్న గిన్నెలకు మూతలు ఉండాలి. మాంసం ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల దానిలో బాక్టీరియా ఇతర పదార్ధలలోకి చేరిపోయే అవకాశం ఉంది. దీన్నీ గట్టిగా మూత బిగించి పెట్టాలి. మాంసాహారం కట్ చేసిన కత్తులు వెంటనే కడిగేయాలి. అదే చాకుతో శుభ్రం చేయకుండా కూరగాయాల కోయొద్దు. ఒక్కదాన్లో నుంచి బాక్టీరియా మరోదానికి వ్యాపించి ఇన్ఫెక్షన్లకు కారణం అవ్వుతుంది. పదార్దాల తయారీలో వాడే వస్తువుల్లో అన్నింటా శ్రద్ద తీసుకోవాలి.

Leave a comment