Categories
ప్రపంచవ్యాప్తంగా స్త్రీపురుషుల మధ్య రాజకీయ అసమానతలు తొలగేందుకు 145.5 సంవత్సరాలు పడుతోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక చెబుతోంది. 15 వ గ్లోబల్ జండర్ గ్యాప్ నివేదిక ప్రకారం 156 దేశాల్లో 35,500 పార్లమెంటు సీట్లు ఉంటే వాటిలో మహిళలకు కేవలం 26.1 శాతం మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా 3,400 మంది మంత్రులు ఉండగా వారిలో మహిళా మంత్రులు 22.6 శాతం మాత్రమే.81 దేశాల అధ్యక్ష పదవుల్లో ఒక్కసారి కూడా మహిళలు లేరు.