Categories
ఉద్యోగం వచ్చాక కాలేజీకి వెళ్ళినట్లు మనిష్టం వచ్చిన డ్రెస్ అనుకునే వీలుండదు. కిన్ని ఆఫీస్ లకు ఫార్మల్స్ వేసుకోవాల్సిందే. కాకపోతే కాస్త బొద్దుగా వున్న ప్యాంటు, షర్టు అంత సౌకర్యంగా వుండవు. అలాంటప్పుడు ఆఫీస్ వేరుగా ఫార్మల్సే వుండలనుకుంటే పెన్సిల్ కట్ ప్యాంటు, పొడవాటి షర్టులు ఎంచుకోవాలి. వంటికి అతుక్కుపోయినవి కాకుండా, యాపిల్ కట్ తరహాలో పొడవాటి షర్టులని, స్కిన్నీ జీన్స్ మీదకు వేసుకుంటే బావుంటుంది. గౌన్లు మినీలు కాకుండా స్కర్టు టాప్, చుడీదార్ వంటివి ఎంచుకోవాలి. వీటి తో పాటు జీన్స్, లెగ్గింగ్స్, జెగ్గింగ్స్ కు జతగా ప్రింటెడ్ షిఫాన్ , క్రెప్ కుర్తాలు, కుర్తీ బావుంటాయి.