Categories
నడకతో కీళ్ళు అలసిపోతూ నొప్పనిపిస్తూ ఉంటే సైకిల్ తొక్కటం మొదలు పెట్టండి అంటున్నారు . సైకిల్ ని ఒక వాహనంగా ఉపయోగించే వారు కూడా అదృష్టవంతులే దాన్ని వ్యాయామంగా కూడా చేయివచ్చు . నలభై వేలమంది పై చేసిన అధ్యయనంలో దాదాపు 20 ఏళ్ళపాటు వారి ఆరోగ్యస్థితిని పరిశీలించారు . సైకిల్ తొక్కే అలవాటు ఉన్నా వారిలో గుండె జబ్బులు,గుండెపోటు ప్రమాదాలు చాల తక్కువగా ఉన్నాయి . సైకిల్ తొక్కుతుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది . శ్వాసక్రియ మెరుగ్గా సాగుతుంది . ఆరోగ్యం సొంతం అవుతుంది .