Categories
ఇండోర్ మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటారు శాస్త్రజ్ఞులు. ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటే కంటికి ఇంపుగానే కాదు,మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచటమే కాదు సులువైన శ్వాసకు కూడా ఉపకరిస్తుంది. గదికో రెండు మొక్కలంటే గాలిని ఫిల్టర్ చేస్తాయి. కార్పెట్లు ఇతర అప్లమెన్స్ లు కంప్యూటర్స్ ,సాధారణ క్లీనర్లు వంటి వాటిలో కనింపించే తక్కువ స్థాయి విషతుల్యమైన రసాయనాలను మొక్కలు గ్రహిస్తాయి. మనకు హాని చేసే రసపాయనాలు గ్రహించి వాటికి ఆహారంగా ఎనర్జీ ఆధారంగా మార్చుకొంటాయి. పామ్స్ లిల్లీలు ఫికస్ వంటి మొక్కలు మిగతా మొక్కల కంటే మేలైనవి.