ఆరోగ్యం ,పర్యావరణ హితం అన్నా పదం వినబడితే చాలు ఆధునిక ప్రపంచం దేన్నైనా సరే రెండు చేతులా ఆహ్వానిస్తోంది. ఎప్పడో మెటల్స్ కనిపెట్టక పూర్వం మన పూర్వీకులు వండుకొన్న మట్టి పాత్రలు ఇవ్వాళ ఆధునిక యువత గుండెలకు హత్తుకొని మరీ ఆదరిస్తున్నారు.మట్టి కుండకే కాదు ప్రెషర్ కుక్కర్ దగ్గర నుంచి ఇడ్లి కుక్కర్ ,వాటర్ బాటిల్స్ వండే గిన్నెలు,వడ్డించే పాత్రలు,టీ కెటీల్ దగ్గర నుంచి మొత్తం టీ సెట్ వరకు మొత్తంగా మట్టి పాత్రలే. వంట ఇంట్లో అవసరం అయిన డబ్బాలు నీళ్ళ పాత్రల దగ్గర నుంచి మట్టివే వాడుతున్నారు. ఆన్ లైన్ ఇమేజెస్ చూస్తే ఆశ్చర్య పోతారు.

Leave a comment