తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా చుట్టు వాతావరణానికి పిల్లలు ప్రభావితులు అవుతారు అంటున్నాయి అధ్యయనాలు . గర్భిణులు కనే ముందరి రోజుల్లో అంటే 8, 9 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు దుమ్ము ,ధూళి ,చెట్లు పువ్వులు ,పుప్పొడి ఉండే ప్రదేశాల్లో తిరిగితే పుట్టబోయే పిల్లలకు శ్వాస సమస్యలు ముఖ్యంగా అస్తామా వచ్చే అవకాశాలు ఉన్నాయట. పిల్లల బొడ్డు తాడు రక్త కణాల్లో అలర్జీ వ్యాధులకు కారణం అయ్యే ఇమ్యునో గ్లోబ్యులిన్ -ఇ శాతం ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు. ఈ ఆధారంగా బిడ్డల్లో వచ్చే శ్వాస సంబంధిత సమస్యలు కనిపెట్టారు. పిల్లలు పుట్టాక కూడా పుప్పొడి పీల్చే వాతావరణంలో ఉంటే దాని ప్రభావం తర్వాతి కాలంలో ఉంటుందంటున్నారు. గడ్డి జాతి మొక్కలు పువ్వులు ఉంటే పార్కుల్లో గంటల తరబడి గక్భిణిగా ఉండే స్త్రీలు గడపటం వల్ల కూడా ఈ సమస్య రావోచ్చునంటున్నారు.
Categories