Categories
గర్భవతిగా ఉన్న సమయంలో తగినంత బరువు ఉండకపోతే నెలల నిండకముందే ప్రసవించే అవకాశాలు ఉన్నాయి. లేదా సిజేరియన్ చేయవల్సిన అవకాశం ఏర్పడుతుందని ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ మరిశోధనలు చెభుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గర్భిణులను పరిశీలిస్తే అందులో సగం కన్నా ఎక్కువ మంది ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు ఉన్నారు. పావుశాతం మంది ఉండవల్సిన దానికన్నా చాలా తక్కువ బరువు ఉన్నారు. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక పోషకాహారం తీసుకోవడం తగినంత బరువు పెరగడం పై ప్రత్యేక దృష్టిపెట్టాలని లేకపోతే నెలలు నిండకుండా ప్రసవం అయ్యే ప్రమాదం ఉంది అని పరిశోధకులు తేల్చారు.