Categories

అద్దం పై దొర్లిపడే ఆవగింజల్లా ఉండాలంటారు భార్య, భర్తల మధ్య వచ్చే తగువులు కాని అలా కాకుండా ప్రతి చిన్న గొడవలోనూ ఎవరికి వాళ్లు మనమే నెగ్గాలని చూస్తే సమస్యే కదా. చిన్నిచిన్ని తగువులు సహజం ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. సాధ్యమైనంత వరకు తగువల ప్రభావం రోజుల తరబడి కొనసాగకుండా చూడాలి. ఒకళ్ళ లోపాలు మరోకరు ఎత్తి చూపుకుని ఆ తగువులు మరింత పెంచేలా చూడకూడదు. తప్పు ఎవరి వైపు వుంటే వారు న్యాయంగా క్షమించమని అడగవచ్చు. ఇందులో నమోషీ అవసరం లేదు. ఒక సారి గొడవ మొదలైతే పాత విషయాలు తవ్వుకుని దాన్ని మరింత పెద్దది చేయాలని చూస్తారు. ప్రస్తుత సందర్భాన్ని బట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కరించుకుంటే ఇద్దరికి మేలు మనశ్శాంతి కూడా.