ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంట్రా ప్రెన్యుర్స్ సమిట్ లో వ్యవాసాయ రంగంలో సాంకేతికత ఎలా వినియోగించాలనే విషయం పైన విస్తృతమైన చర్చ నిలిచింది. రేపటి సేద్యం ఎలా ఉంటుందన్నదే చర్చ. ఇక రాబోయే రోజుల్లో ఎకో ఫ్రెండ్లీ విలేజస్ నిర్మించేస్తారు. ఇప్పటికే సింగపూర్ లో స్కై గ్రీన్స్ అనే స్టార్టప్ మొక్కల్ని అంతస్థూలు, అంతస్తులు గా పెంచాలని నిర్ణయించి ఇనుప ఫ్రేమ్స్ రుపొందించింది. ఒక భవనం చుట్టూ రివాల్వింగ్ చెయిర్ లా ఈ మొక్కలు తిరుగుతూ సూర్య రశ్మిని సమంగా అందుకుంటున్నాయి. మొత్తం భావనం నిలువునా కలిపి రెండున్నర ఎకరాల సేద్యం చేస్తున్నారన్నమాట. ప్రతి సంవత్సరం 50 వేల టన్నుల పంట పందిస్తున్నారు. హైడ్రో ఫోనిక్స్ ప్రక్రియలో, నీటి అవసరం దాదాపుగా లేకుండా మినరల్స్ ఎక్కువగా వుండే ద్రవం వుపయోగించి గార్డెన్స్ సృష్టించవచ్చు. పెరటి తోటలో బిల్డింగ్ డిజైన్ లో భాగం అవ్వుతాయి.
Categories