ఒలంపిక్స్ లో ఉమెన్ సైకిలింగ్ లో బంగారు పతకం గెలుచుకున్నారు అన్నా కీసన్‌హోఫర్ ఆమె మాథ్స్ ప్రొఫెసర్ ఆస్ట్రియాకు చెందిన 30 ఏళ్ల అన్నా కీసన్‌హోఫర్ వియన్నా లోని టెక్నికల్ యూనివర్సిటీ నుంచి బిఎస్సీ పూర్తిచేశారు.కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో ఎంఎస్సీ చేశారు. ప్రస్తుతం స్విజర్లాండ్ లో మాథ్స్ పోస్ట్ డాక్టరేట్ ఫెలోగా పనిచేస్తున్నారు. 2011 నుంచి 2013 వరకు పరుగు పందెంలో పాల్గొన్న ఆమె ఆ తర్వాత రన్నింగ్ వదలి సైక్లింగ్ వైపు వచ్చారు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం గెలుచుకొని ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు.