Categories
చాలా మంది పుస్తకం చదువుతున్నా, టీవి చూస్తున్నా, గోళ్ళు కొరికేస్తుంటారు. కాస్త విశ్రాంతిగా కూర్చున్నా, గోళ్ళు నోట్లోకి వెళ్లి పోతూ ఉంటాయి. ఈ అలవాటు చూసేందుకు ఎబ్బెట్టుగా వుండటమే కాదు. క్రీములు నోట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. దీని వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. గోళ్ళు కొరుకుతూ, నోల్లో వెళ్ళు పోనిస్తూ వుండటం వల్ల పిల్లల్లో అలెర్జీలు ఎక్కువగా వస్తున్నాయని న్యూజిలాండ్ పరిశోధకులు గుర్తించారు. చిన్నతనం నుంచి గోళ్ళు కోరికే అలవాటు వుంటే, దాని దుష్పలితం 13,14 ఏళ్ళు వచ్చాక బయట పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.