కోవిడ్ సమయంలో మోడీ రోబో తయారు చేసింది పాట్నా కు చెందిన ఆకాంక్ష కుమారి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతున్న ఆమె తయారు చేసిన మోడీ రోబో రోగి రియల్ టైం డేటాను డాక్టర్లకు చేరుస్తుంది. మందులు సరఫరా ఆహారం సరఫరా నీటిని అందించడం ఆక్సిజన్ అమర్చటం వంటివి చేస్తుంది. దీనితో రాత్రుళ్లు కూడా పని చేయగల 360 డిగ్రీల హై రిజల్యూషన్ కెమెరాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులు రోగుల తో మాట్లాడవచ్చు. ఈ ఆవిష్కరణ కు గానూ ఆకాంక్ష కుమారి కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థ విద్యా మంత్రిత్వ శాఖ నుంచి విశ్వకర్మ అవార్డు తీసుకుంది.

Leave a comment